భగవద్గీత - అక్షరపరబ్రహ్మ యోగము - ఎనిమిదవ అధ్యాయము

అక్షరపరబ్రహ్మ యోగమునందలి ప్రధాన విషయములు

అక్షరము, బ్రహ్మము అను రెండు పదములును భగవంతుని సగుణ నిర్గుణ స్వరూపములను తెల్పును. ‘క్షర’ మనగా నశించునది. అక్షరమనగా నాశరహితమైనది. అట్లే భగవంతుని యొక్క ‘ఓమ్’ అను నామమును గూడ అక్షరము, బ్రహ్మము అని పిలిచెదరు. ఈ అధ్యాయమునందు భగవంతునియొక్క సగుణ నిర్గుణ రూపములు, ఓంకారము వర్ణింపబడినవి. కనుక ‘అక్షరపరబ్రహ్మయోగము’ అను పేరు ఈ అధ్యాయమునకు వచ్చినది.
Scroll to Top