భగవద్గీత - రాజవిద్యా రాజగుహ్య యోగము - తొమ్మిదవ అధ్యాయము

రాజవిద్యా రాజగుహ్య యోగమునందలి ప్రధాన విషయములు

రాజ పదము శ్రేష్ఠత్వమును సూచించును. రాజవిద్యయనగా విద్యలలోకేల్ల శ్రేష్ఠమైనదనియు, రాజగుహ్యమనగా రహస్యములలోకెల్ల పరమరహస్యమైనదనియు అర్థము. లేక, రాజవిద్యయనగా పూర్వకాలము రాజులు అనుష్టించుచువచ్చిన గొప్పవిద్యయనియు చెప్పవచ్చును. ఈ అధ్యాయమునందు చెప్పబడిన అమూల్యమగు అధ్యాత్మబోధ విద్యలన్నిటిలోను సర్వోత్కృష్టమైనదియు, రహస్యములన్నిటిలోను పరమరహస్యమైనదియు అయియుండుట వలన ఈ అధ్యాయమునకు రాజవిద్యా రాజగుహ్య యోగము అను పేరు వచ్చినది.
Scroll to Top