భగవద్గీత - విభూతి యోగము - పదవ అధ్యాయము

విభూతి యోగమునందలి ప్రధాన విషయములు

ఈ అధ్యాయమునందు ప్రధానముగా భగవంతుని యొక్క విభూతుల వర్ణనముగలదు. విభూతియనగా ఐశ్వర్యము. మహిమాతిశయము. ఈ చరాచర ప్రపంచము అంతయు భగవంతుని యొక్క వ్యక్తరూపమే. కావున వారి విభూతియే అగును. ఇది అంతయు వారి మహిమావిస్తారమే. చిద్విలాసమే అయి ఉన్నది. భగవద్విభూతియే యగు ఈ ప్రపంచమున భగవానుడు విశేషముగ అభివ్యక్తమైన పదార్థములను గూర్చి వ్యక్తులను గూర్చి వర్ణింపబడిన అధ్యాయము అగుటచే దీనికి ‘విభూతియోగము’ అను పేరు వచ్చినది.
Scroll to Top