భగవద్గీత - ఆత్మసంయమ యోగము - ఆరవ అధ్యాయము

ఆత్మసంయమ యోగమునందలి ప్రధాన విషయములు

కర్మయోగసాధనయందును, సాంఖ్యయోగసాధనయందును ఉపయుక్తమగు ధ్యానయోగవర్ణనము ఈ అధ్యాయమునందు స్పష్టముగా విశదపరచబడినది. ధ్యానయోగమునందు శరీరము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి అనువాని సంయమము పరమావశ్యకము. శరీరము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి – ఇవి అన్నియు ఆత్మ అను పదముతో పేర్కొనబడును. ఈ అధ్యాయమునందు వీటి సంయమవర్ణనమే విశేషముగా చేయబడినది. కావున ఈ అధ్యాయమును ‘ఆత్మసంయమయోగము’ అను పేరుతో పేర్కొనుట జరిగినది.
Scroll to Top