భగవద్గీత - జ్ఞాన యోగము - నాలుగవ అధ్యాయము

జ్ఞాన యోగమునందలి ప్రధాన విషయములు

ఈ అధ్యాయమునందు జ్ఞానసంబంధమైన విచారణయుండుట చేతను, జ్ఞానతపస్సు, జ్ఞానయజ్ఞము, జ్ఞాననౌక, జ్ఞానాగ్ని, జ్ఞానఖడ్గము – మున్నగు వానిని గూర్చి ప్రస్తావింపబడుటచేతను, ఆధ్యాత్మజ్ఞానము యొక్క మహిమ విశేషముగ చెప్పబడుటచేతను, అట్టి జ్ఞానము ఎవరికి ఎట్లు లభించునో చక్కగ విశదీకరింపబడుట చేతను ఈ ప్రకారముగ జ్ఞానమునకు సంబంధించిన విషయములే ఎక్కువగా వర్ణింప బడియుండుట వలనను దీనికి జ్ఞానయోగమని పేరు పెట్టబడినది. ఈ అధ్యాయము నందు ‘జ్ఞాన’ శబ్దము పరమార్థ జ్ఞానమును, లేక తత్త్వజ్ఞానమును ప్రతిపాదించును. ‘కర్మ’ శబ్దము కర్మయోగమును అనగా యోగమార్గమును సూచించును. అట్లే ‘సన్న్యాస’ శబ్దము సాంఖ్యయోగమును లేక జ్ఞానమార్గమును తెలుపును. వివేకజ్ఞానము మరియు శాస్త్రజ్ఞానము అనునవియును జ్ఞాన శబ్దములో చేరినవే. ఇందు భగవంతుడు తన అవతార రహస్యములను, కర్మయోగము యొక్క యథార్థ తత్త్వమును అట్లే సన్న్యాసయోగమును గూర్చియు విశదపరిచెను. అంతేగాక ఈ మూడింటి ఫలస్వరూపమైన పరమాత్మ తత్త్వము యొక్క యథార్థ జ్ఞానమును గూడ వర్ణించెను. జ్ఞానసంబంధమైన విచారణయుండుట చేతను, జ్ఞానతపస్సు, జ్ఞానయజ్ఞము, జ్ఞాననౌక, జ్ఞానాగ్ని, జ్ఞానఖడ్గము – మున్నగు వానిని గూర్చి ప్రస్తావింపబడుటచేతను, ఆధ్యాత్మజ్ఞానము యొక్క మహిమ విశేషముగ చెప్పబడుటచేతను, అట్టి జ్ఞానము ఎవరికి ఎట్లు లభించునో చక్కగ విశదీకరింపబడుట చేతను ఈ ప్రకారముగ జ్ఞానమునకు సంబంధించిన విషయములే ఎక్కువగా వర్ణింప బడియుండుట వలనను దీనికి జ్ఞానయోగమని పేరు పెట్టబడినది.
Scroll to Top