భగవద్గీత - క్షేత్రక్షేత్రజ్ఞవిభాగ యోగము - పదమూడవ అధ్యాయము

క్షేత్రక్షేత్రజ్ఞవిభాగ యోగమునందలి ప్రధాన విషయములు

క్షేత్రమనగా శరీరము. క్షేత్రజ్ఞుడనగా ఆత్మ. జీవుడు వాస్తవముగ క్షేత్రజ్ఞుడేకాని క్షేత్రముకాదు. కాని అజ్ఞాన కారణమున తాను క్షేత్రమని తలంచి జీవుడు దుఃఖములను అనుభవించుచున్నాడు. క్షేత్రము పంచభూతాత్మకమైనది, నశ్వరమైనది, వికారవంతమైనది. క్షేత్రజ్ఞుడు చిన్మయరూపుడు, శాశ్వతుడు, వికారరహితుడు. ఆ రెండింటి యొక్క స్వభావములు వివరింపబడి, కలిసియున్నట్టి వానియొక్క విభజనమును గూర్చి తెలుపబడిన అధ్యాయము అగుటచే దీనికి ‘క్షేత్రక్షేత్రజ్ఞవిభాగయోగము’ అను పేరు వచ్చినది.
Scroll to Top