భగవద్గీత - శ్రద్ధాత్రయవిభాగ యోగము - పదిహేడవ అధ్యాయము

శ్రద్ధాత్రయవిభాగ యోగమునందలి ప్రధాన విషయములు

శ్రద్ధ మూడు విధములుగా ఉండును. సాత్త్వికశ్రద్ధ, రాజసికశ్రద్ధ, తామసికశ్రద్ధ అని. ఏయే శ్రద్ధ గలవాని లక్షణములు ఏయే విధముగ ఉండునో ఈ అధ్యాయమున వివరముగ తెలుపబడినవి. ఈ అధ్యాయ ప్రారంభమున శ్రద్ధాయుక్తులైన పురుషుల నిష్ఠలను గూర్చి అర్జునుడు ప్రశ్నించెను – దానికి సమాధానముగా భగవానుడు మూడు విధములైన శ్రద్ధలను తెల్పి, వాటిని అనుసరించియే పురుషుల స్వభావములుండునని తెల్పెను. పిమ్మట పూజలు, యజ్ఞములు, తపస్సులు మొదలగు వాటితో శ్రద్ధకు గల సంబంధమును వర్ణించి, చివరి శ్లోకమున శ్రద్ధారహిత పురుషుల కర్మలను ‘అసత్’ అని పేర్కొనెను. ఈ ప్రకారముగ మూడు విధములైన శ్రద్ధను (గుణమును) గురించి చెప్పబడిన అధ్యాయము అగుటచే దీనికి శ్రద్ధాత్రయవిభాగయోగము అను పేరు వచ్చినది.
Scroll to Top