భగవద్గీత - కర్మసన్యాస యోగము - ఐదవ అధ్యాయము

కర్మసన్యాస యోగమునందలి ప్రధాన విషయములు

సన్న్యాసమనగా త్యాగము. కర్మత్యాగము ప్రారంభమున కూడదనియు, కర్మఫలత్యాగరూపమగు నిష్కామకర్మయోగమును శీలించుచురాగా చిత్తశుద్ధిగలిగినమీదట నిర్విషయ ఆత్మస్థితియందు, లేక అట్టిస్థితి కొరకు కర్మత్యాగమనునది సంభవించుననియు కాబట్టి సాధకులకు కర్మసన్న్యాసము కంటె కర్మయోగమే శ్రేష్ఠమైనదనియు ఈ అధ్యాయమున చెప్పబడినది. ఈ ప్రకారముగ కర్మసన్న్యాసమును గూర్చి వివరముగ బోధించిన అధ్యాయమగుటచే దీనికి కర్మసన్న్యాస యోగమను పేరు కలిగినది. లేక ‘సన్న్యాస’ మను పదము సాంఖ్యమునకు, జ్ఞానమునకు పర్యాయముగ వాడబడుచుండును. ఈ అధ్యాయమునందు కర్మయోగము, జ్ఞానయోగము రెండింటిని గూర్చి వచింపబడియుండుటచే గూడ దీనికి కర్మసన్న్యాసమను పేరు ఏర్పడియుండవచ్చును.
Scroll to Top