భగవద్గీత - గుణత్రయవిభాగ యోగము - పదనాలుగవ అధ్యాయము

గుణత్రయవిభాగ యోగమునందలి ప్రధాన విషయములు

ఈ అధ్యాయమునందు సత్త్వరజస్తమములు అను మూడు గుణముల స్వరూపములును, వాటి కార్యములును, కారణములును, ప్రభావములును వర్ణింపబడినవి. అవి ఏవిధముగా ఏ పరిస్థితులయందు జీవాత్మను ఎట్టి బంధములలో పడవేయును? మనుష్యుడు ఏ విధముగా వీటి నుండి ముక్తిని పొంది, పరమపదమును చేరగలడు. అట్లే ఈ మూడు గుణముల కతీతుడై పరమాత్మప్రాప్తిచెందిన మనుష్యుని లక్షణములేవి? త్రిగుణ సంబంధమైన ఈ విషయములన్నియును ఇందు వివేచన చేయబడినవి. మొదట సాధనకాలమందు రజస్తమో గుణములను పారద్రోలి, సత్త్వగుణమునే గ్రహింపవలెననియు, చివరికి గుణములన్నింటితో గల సంబంధము పూర్తిగా తొలగించు కొనవలెననియు తెల్పుటకై ఆ మూడు గుణములను విభాగపూర్వముగా వర్ణించుట జరిగినది. కావున ఈ అధ్యాయమునకు ‘గుణత్రయవిభాగయోగము’ అను పేరు ఏర్పడినది.
Scroll to Top