భగవద్గీత - భక్తి యోగము - పన్నెండవ అధ్యాయము

భక్తి యోగమునందలి ప్రధాన విషయములు

భక్తిని గురించి ప్రతిపాదించబడిన అధ్యాయమగుటచే దీనికి భక్తియోగమను పేరు వచ్చినది. భక్తియొక్క స్వరూపము, భక్తుని లక్షణములు, వివిధ ఆధ్యాత్మిక సాధనములు ఈ అధ్యాయమున పేర్కొనబడినవి. ఈ అధ్యాయము భక్తితో ప్రారంభింపబడి భక్తితో అంతమైనది. కేవలము 3 శ్లోకములలో మాత్రమే జ్ఞానసాధనను గూర్చి వర్ణింపబడినది. అదియును భక్తి – జ్ఞానయోగముల యొక్క తులనాత్మక వివేచనకై చేయబడినది. ఈ ప్రకారముగ భక్తిని గూర్చియు, భక్తుని గూర్చియు విశేషముగ తెలుపబడుట వలన ఈ అధ్యాయమునకు ‘భక్తియోగము’ అను పేరు వచ్చినది.
Scroll to Top