భగవద్గీత - జ్ఞానయోగము - నాలుగవ అధ్యాయము

భగవద్గీత - జ్ఞానయోగము - నాలుగవ అధ్యాయము - ఇరవై తొమ్మిదవ శ్లోకము

అపానే జుహ్వతి ప్రాణం ప్రాణేపానం తథాపరే |
ప్రాణాపానగతీ రుధ్వా ప్రాణాయామపరాయణాః |
అపరే నియతాహారాః ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి |

తాత్పర్యం :-

సమాధిలోనుండుటకై శ్వాస నిరోద విధానమును అవలంభించు వారు కూడా కొందరు కలరు. వారు బయటికి పోవు ఊపిరి యొక్క చలనమును, లోపలికి వచ్చు దానియందును, లోపలి వచ్చు ఊపిరిని బయటికి పోవుదానియందును నిలిపుటకు అభ్యసించి చివరికి ఉచ్వాస నిచ్వాసములను ఆపి సమాధియందుందురు. వారిలో కొందరు ఆహార పరిణామమును తగ్గించి యజ్ఞ రూపమున బయటికి పోవు ఊపిరిని దానియందే అర్పింతురు.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top