భగవద్గీత - జ్ఞానయోగము - నాలుగవ అధ్యాయము

భగవద్గీత - జ్ఞానయోగము - నాలుగవ అధ్యాయము - పదహారవ శ్లోకము

కిం కర్మ కిమకర్మేతి కవయోప్యత్ర మోహితాః |
తత్తే కర్మ ప్రవక్ష్యామి యద్ జ్ఞాత్వామోక్షసేశుభాత్ ||

తాత్పర్యం :-

విద్వాంసులు కూడా కర్మయనగానేమో, అకర్మయనగానేమో నిర్ణయించుట యందు బ్రాంతులై ఉన్నారు. నీకిపుడు కర్మయనగానేమో వివరింతును. దానిని తెలిసికొని నీవు అన్ని అశుభముల నుండియు విముక్తుడవగుదువు.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top