భగవద్గీత - జ్ఞానయోగము - నాలుగవ అధ్యాయము

భగవద్గీత - జ్ఞానయోగము - నాలుగవ అధ్యాయము - పదమూడవ శ్లోకము

చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మవిభాగశః |
తస్య కర్తారమపి మాం విద్ధ్యకర్తారమవ్యయమ్ ||

తాత్పర్యం :-

ప్రకృతి యందలి మూడు గుణుములననుసరించియు వానితో సంభందిచియున్న పనిననుసరించియు మానవ సమాజమునందలి నాలుగు విభాగములును నాచే సృజింపబడినవి. ఈ విధానమునకు నేనే కర్తనైననూ మార్పులేని వాడనగుటచే అకర్తను కూడా నేనే అని తెలిసికొనుము.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top