భగవద్గీత - జ్ఞానయోగము - నాలుగవ అధ్యాయము

భగవద్గీత - జ్ఞానయోగము - నాలుగవ అధ్యాయము - మొదటి శ్లోకము

శ్రీభగవానువాచ
ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయమ్ |
వివస్వాన్మనవే ప్రాహ మనురిక్ష్వాకవేఽబ్రవీత్ ||

శ్రీభగవానువాచ = దేవదేవుడైన శ్రీకృష్ణభగవానుడు పలికెను
ఇమం = ఈ
వివస్వతే = సూర్యునికి
యోగం = మానవునికి భగవానునితో గల సంబంధవిజ్ఞానము
ప్రోక్తవాన్ = ఉపదేశించితిని
అహం = నేను
అవ్యయమ్ = నాశనము లేని
వివస్వాన్ = వివస్వానుడు (సూర్యదేవుని నామము)
మనవే = మానవులకు తండ్రియైన వైవస్వతమనువునకు
ప్రాహ = చెప్పెను
మనుః = మనువు
ఇక్ష్వాకవే = ఇక్ష్వాకురాజునకు
అబ్రవీత్ = చెప్పెను

తాత్పర్యం :-

దేవాతిదేవుడైన శ్రీకృష్ణుడు ఇట్లు పలికెను - నాశము లేని ఈ యోగ శాస్త్రమును నేను వివశ్వంతునికి ఉపదేశించితిని. సూర్యదేవుడు దానిని మానవ జాతిపిత అయిన మనువునకు ఉపదేశించెను. మనువు ఇక్ష్వాకు రాజునకు ఉపదేశించెను.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top