భగవద్గీత - అర్జునవిషాదయోగము - మొదటి అధ్యాయము

భగవద్గీత - అర్జునవిషాదయోగము - మొదటి అధ్యాయము - నలుబై ఐదవ శ్లోకము

అహో బత మహత్పాపం కర్తుం వ్యవసితా వయమ్ ।
యద్రాజ్యసుఖలోభేన హంతుం స్వజనముద్యతాః ॥

అహో = అయ్యో!
బత = ఎంత దారుణము
వయమ్ = మనము
మహత్ పాపమ్ = మహాపాపమును
కర్తుమ్ = చేయుటకు
వ్యవసితాః = సిద్ధమైతిమి
యత్ = ఏదయితే
రాజ్యసుఖ లోభేన = రాజ్యసుఖ లోభముచే
స్వజనమ్ = స్వజనులను
హంతుమ్ = చంపుటకు
ఉద్యతాః = ఉద్యుక్తులమైతిమి

తాత్పర్యం :-

అయ్యో! మనము బుద్ధిమంతులమై యుండియు రాజ్యసుఖ లోభముచే స్వజనులనే సంహరించుటకు ఉద్యుక్తులమై ఈ ఘోర పాపకృత్యములకు ఒడిగట్టుచున్నాము, ఇది ఎంత దారుణము?

స్వార్థపూరిత భావములతో ప్రేరేపింపబడి మనుజుడు కొన్నిమార్లు స్వంత సోదరుడు, తండ్రి లేదా తల్లిని కూడా వధించుట వంటి పాపకార్యమునకు ఒడిగట్టును. ప్రపంచ చరిత్రలో అట్టి సంఘటనలు పలుకలవు. కాని అర్జునుడు శ్రీకృష్ణభగవానుని భక్తుడైనందున నీతినియమములను గూర్చిన పూర్తి ఎరుక కలిగి కార్యములు జరుగకుండునట్లుగా గాంచెను.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top