భగవద్గీత - అర్జునవిషాదయోగము - మొదటి అధ్యాయము

భగవద్గీత - అర్జునవిషాదయోగము - మొదటి అధ్యాయము – ఇరవై నాలుగవ శ్లోకము

సంజయ ఉవాచ
ఏవముక్తో హృషీకేశో గుడాకేశేన భారత ।
సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రాథోత్తమమ్ ॥

సంజయః ఉవాచ = సంజయుడు పలికెను
ఏవం = ఆ విధముగా
ఉక్తః = సంబోధింపబడినవాడై
హృషీకేశః = శ్రీకృష్ణభగవానుడు
గుడాకేశేన = అర్జునునిచే
భారత = ఓ భరతవంశీయుడా
సేనయోరుభయోః = రెండు సేనల యొక్క
మధ్యే = నడుమ
స్థాపయిత్వా = నిలిపి
రథోత్తమమ్ = శ్రేష్ఠమైన రథమును

తాత్పర్యం :-

సంజయుడు పలికెను, ఓ భరతవంశీయుడా! అర్జునునిచే ఆ విధముగా సంబోధింపబడినవాడై శ్రీకృష్ణభగవానుడు ఉత్తమమైన రథమును ఇరుపక్షపు సేనల నడుమ నిలిపెను.

ఈ శ్లోకము నందు అర్జునుడు గూడాకేశునిగా సంబోధింపబడినాడు. “గుడాక”మనగా నిద్ర యని భావము. అట్టి నిద్రను జయించినవాడు గుడాకేశునిగా పిలువబడును. నిద్రయనగా అజ్ఞానమనియు భావము. అనగా అర్జునుడు శ్రీకృష్ణభగవానుని సఖ్యము కారణమున నిద్ర మరియు అజ్ఞానము రెండింటిని జయించెను. కృష్ణభక్తునిగా అతడు శ్రీకృష్ణభగవానుని క్షణకాలము సైతము మరచియుండలేదు. ఏలయన అదియే భక్తుని లక్షణము. నిద్రయందైనను లేదా మెలకువ యందైనను భక్తుడెన్నడును శ్రీకృష్ణుని నామ, రూప, గుణ, లీలల స్మరణమును మరువడు. ఆ విధముగా కృష్ణభక్తుడు శ్రీకృష్ణునే నిరంతరము తలచుచు నిద్ర మరియు అజ్ఞానము రెండింటిని సులభముగా జయింపగలుగును. ఇదేయే “కృష్ణభక్తిరసభావనము” లేదా సమాధి యని పిలువబడుచున్నది. హృషీకేశునిగా లేదా ప్రతిజీవి యొక్క ఇంద్రియముల నిర్దేశకునిగా శ్రీకృష్ణభగవానుడు ఇరుసేనల నడుమ రథమును నిలుపుమనెడి అర్జునిని ప్రయోజనమును అవగతము చేసికొనెను.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top