భగవద్గీత - అర్జునవిషాదయోగము - మొదటి అధ్యాయము

భగవద్గీత - అర్జునవిషాదయోగము - మొదటి అధ్యాయము - ఆరవ శ్లోకము

యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ ।
సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః ॥

యుధామన్యుః = యుధామన్యుడు
చ = మరియు
విక్రాస్తః = పరాక్రమవంతుడైన
ఉత్తమౌజాః = ఉత్తమౌజుడు
చ = మరియు
వీర్యవాన్ = గొప్ప శక్తిమంతుడైన
సౌభద్రః = సుభద్రాతనయుడు
ద్రౌపదేయాః = ద్రౌపది పుత్రులును
చ = మరియు
సర్వే = అందరును
ఏవ = నిశ్చయముగా
మహారథాః = మహారథులు

తాత్పర్యం :-

పరాక్రమవంతుడైన యుధామన్యుడు, శక్తిశాలియైన ఉత్తమౌజుడు, సుభద్రా తనయుడు, ద్రౌపది కుమారులును అందున్నారు. ఈ వీరులందరును మహారథులు.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top