భగవద్గీత - అర్జునవిషాదయోగము - మొదటి అధ్యాయము

భగవద్గీత - అర్జునవిషాదయోగము - మొదటి అధ్యాయము - నలుబై ఆరవ శ్లోకము

యది మామప్రతీకారమశస్త్రం శస్త్రపాణయః ।
ధార్తరాష్ట్రా రణే హన్యుః తన్మే క్షేమతరం భవేత్ ॥

యది = ఒకవేళ
అశస్త్రమ్ = శస్త్రములను త్యజించినట్టి
అప్రతీకారమ్ = ప్రతీకారమును చేయనట్టి
మామ్ = నన్ను
శస్త్రపాణయః = శస్త్రములను చేబూనిన
ధార్తరాష్ట్రాః = ధార్తరాష్ట్రులు
రణే = సమరమునందు
హన్యుః = చంపినవారైనను
తత్ మే = అది నాకు
క్షేమతరమ్ = శ్రేయస్కరమే
భవేత్ = అగును

తాత్పర్యం :-

నిరాయుధుడను మరియు ప్రతీకారము చేయనివాడను అగు నన్ను శస్త్రధారులైన ధృతరాష్ట్రుని పుత్రులు రణరంగమునందు వధించినచో అది నాకు క్షేమకరమే కాగలదు.

ఇప్పుడు యుద్ధము ప్రకటించినప్పటికిని నేను శస్త్రములను త్యజించుదును. వారి ఎట్టి క్రియకైనను ప్రతిక్రియ జేయబూనను. అప్పుడు ఒకవేళ వారును యుద్ధము విరమించినచో ఆత్మీయులందరును రక్షింపబడెదరు. కాని ఒకవేళ వారట్లు చేయక నన్ను నిరాయుధుని, యుద్ధనివృత్తునిగా భావించి వధించినను ఆ మృత్యువు కూడా నాకు అత్యంత కళ్యాణకారకమే అగును. ఏలనన, దీనితో నేను ముందుగా వంశనాశనమనెడు భయంకర పాపము నుండి కాపాడబడుదును. మా సోదరులు, బంధువులు, ఆత్మీయులు రక్షింపబడుదురు. కుల రక్షాజనితమగు మహాపుణ్యకర్మ ఫలము వలన నాకు పరమ పద ప్రాప్తి కూడా సుకరమైపోవును.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top