భగవద్గీత - అర్జునవిషాదయోగము - మొదటి అధ్యాయము

భగవద్గీత - అర్జునవిషాదయోగము - మొదటి అధ్యాయము - నలుబదవ శ్లోకము

కులక్షయే ప్రణశ్యంతి కులధర్మాః సనాతనాః ।
ధర్మే నష్టే కులం కృత్స్నమ్ అధర్మోఽభిభవత్యుత ॥

కులక్షయే = వంశను నాశనమగుట కారణముగ
సనాతనాః = సనాతనములైన
కులధర్మాః = కులధర్మములు
ప్రణశ్యంతి = నశించిపోవును
ధర్మే నష్టే = ధర్మము అంతరించి పోవుచుండగా
కృత్స్నమ్ = సమస్తమైన
కులమ్ = వంశము
అధర్మః ఉత = అధర్మమే
అభిభవతి = వ్యాపించును

తాత్పర్యం :-

కులక్షయము వలన సనాతనములైన కులధర్మములన్నియును నశించును. ధర్మము అంతరించి పోయినప్పుడు కులమునందు అంతటను పాపమే వ్యాపించును.

వంశము నందలి వారు సక్రమముగా వృద్ధి\నొంది ఆధ్యాత్మిక విలువలను సంతరించుకొనుటకై సహాయపడుటకు పలు ధర్మ నియమములు వర్ణాశ్రమ పద్ధతి యందు కలవు. జన్మ మొదలుగా మృత్యువు వరకు గల అట్టి అనేక శుద్ధికర్మలకు వంశంలోని పెద్దలు బాధ్యతను వహింతురు. కాని ఆ పెద్దల మరణము పిమ్మట అట్టి వంశాచారములు నిలిచిపోయి మిగిలిన వంశమువారు అధర్మమగు అలవాట్లకు వృద్ధిచేసికొను అవకాశము కలదు. తద్ద్వారా ఆధ్యాత్మిక ముక్తికి వారు అవకాశమును కోల్పోగలరు. కనుకనే ఏ ప్రయోజనము కొరకైనను వంశ పెద్దలను వధింపరాదు.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top