భగవద్గీత - కర్మయోగము - మూడవ అధ్యాయము

భగవద్గీత - కర్మయోగము - మూడవ అధ్యాయము - ఎనిమిదవ శ్లోకము

నియతం కురు కర్మ త్వం కర్మ జ్యాయో హ్యకర్మణః |
శరీరయాత్రాపి చ తే న ప్రసిద్ధ్యేదకర్మణః ||

నియతం = విధ్యుక్తమైన
కురు = చేయుము
కర్మ = కర్మలు
త్వం = నీవు
కర్మ = పని
జ్యాయః = మేలుతరమైనది
హి = నిశ్చయముగా
అకర్మణః = పనిచేయకుండ ఉండుట కంటె
శరీరయాత్రా = దైహికమైన జీవితయాత్ర
అపి = అయినను
చ = కూడా
తే = నీ యొక్క
అకర్మణః = కర్మ లేకుండా
న ప్రసిద్ధ్యేతే = సిద్ధింపదు

తాత్పర్యం :-

నియమింపబడిన నీ కర్మమమును హృదయ పూర్వకముగా చేయుము. అట్లు చేయుట అసలు కర్మ చేయపోవుట కంటే చాలా మంచిది. మానవుడు కర్మ లేకుండా భౌతికమైన దేహమును పోషించుకొనజాలడు.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top