భగవద్గీత - కర్మయోగము - మూడవ అధ్యాయము

భగవద్గీత - కర్మయోగము - మూడవ అధ్యాయము - రెండవ శ్లోకము

వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే |
తదేకం వద నిశ్చిత్య యేన శ్రేయోఽహమాప్నుయామ్ ||

వ్యామిశ్రేణ = అనేకార్థములు కలిగిన
ఇవ = వలె
వాక్యేన = వచనముచే
బుద్ధిం = తెలివిని
మోహయసి = మోహింపజేయుచున్నావు
ఇవ = వలె
మే = నా యొక్క
తత్ = అందుచే
ఏకం = ఒక్కటే
వద = దయతో తెలుపుము
నిశ్చిత్య = నిశ్చయించి
యేన = దేనిచే
శ్రేయః = నిజమైన లాభమును
అహం = నేను
ఆప్నుయామ్ = పొందుదునో

తాత్పర్యం :-

సందిగ్ధములైన నీ భోధనలచే నా బుద్ధి కలతనొందినది. అందుచే నాకు మిక్కిలి హితము కలిగించు మార్గమేదో దయయుంచి నిశ్చయముగా తెలుపుము.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top