భగవద్గీత - కర్మయోగము - మూడవ అధ్యాయము

భగవద్గీత - కర్మయోగము - మూడవ అధ్యాయము - పదవ శ్లోకము

సహయజ్ఞాః ప్రజాః సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః |
అనేన ప్రసవిష్యధ్వమేష వోఽస్త్విష్టకామధుక్ ||

సహయజ్ఞాః = యజ్ఞములతో సహా
ప్రజాః = ప్రజలను
సృష్ట్వా = సృజించి
పురా = పూర్వకాలమున
ఉవాచ = పలికెను
ప్రజాపతిః = జీవులకు ప్రభువైన భగవంతుడు
అనేన = దీనిచే
ప్రసవిష్యధ్వం = అధికముగా శ్రేయస్సును పొందుడు
ఏషః = ఇది
వః = మీకు
అస్తు = అగుగాక
ఇష్ట = కోరినవన్నింటిని
కామధుక్ = ఒసగునది

తాత్పర్యం :-

సృష్టి ప్రారంభమున సర్వజీవులకు ప్రభువైన భగవంతుడు విష్ణువు కొరకు ఉద్దేశించబడిన యజ్ఞములతో కూడా మానవ దేవతా సమూహములను జగత్తునకు పంపి ఈ యజ్ఞముచే మీరు సంపన్నులు కండు ఏలయన దీని ఆచరణను మీకు సుఖముగా జీవించుటకునూ బంధవిముక్తి కలుగుటకునూ కావలసిన సర్వాభీష్టములను వసందును అని ఆశీర్వదించెను.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top