భగవద్గీత - కర్మయోగము - మూడవ అధ్యాయము

భగవద్గీత - కర్మయోగము - మూడవ అధ్యాయము - ముప్పై ఒకటవ శ్లోకము

యే మే మతమిదం నిత్యమనుతిష్ఠన్తి మానవాః |
శ్రద్ధావన్తోఽనసూయన్తో ముచ్యన్తే తేఽపి కర్మభిః ||

యే = ఎవరు
మే = నా యొక్క
మతమ్ = ఆదేశమును
ఇదం = ఈ
నిత్యం = నిత్యధర్మముగా
అనుతిష్ఠన్తి = సక్రమముగా నిర్వహింతురో
మానవాః = మానవులు
శ్రద్ధావన్తః = శ్రద్ధాభక్తులతో
అనసూయన్తః = అసూయ లేకుండా
ముచ్యన్తే = విడువబడుదురు
తే = వారు
అపి = కూడా
కర్మభిః = కామ్యకర్మబంధముల నుండి

తాత్పర్యం :-

నా ఆజ్ఞనలననుసరించి తమ ధర్మములు నిర్వహించుచూ ఈ ఉపదేశమును అసూయారహితులై విశ్వాసముతో అనుసరించువారు కామ్య కర్మ బంధం నుండి విడువబడుదురు.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top