భగవద్గీత - కర్మయోగము - మూడవ అధ్యాయము

భగవద్గీత - కర్మయోగము - మూడవ అధ్యాయము - ఇరవై రెండవ శ్లోకము

న మే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన |
నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి ||

మే = నాకు
పార్థ = ఓ పృథాకుమారా
న అస్తి = లేదు
కర్తవ్యం = చేయవలసినది
త్రిషు లోకేషు = ముల్లోకములందు
కించన = ఏదియు
అనవాప్తం = కోరునది
అవాప్తవ్యం = పొందవలసినది
న = లేదు
వార్తే = నియుక్తుడనై యున్నాను
ఏవ = నిశ్చయముగా
చ = కూడా
కర్మణి = విహితకర్మ యందు

తాత్పర్యం :-

ఓ ప్రుదాకుమారా! ముల్లోకములందును నాకు విహితమైన కర్మమేదియూ లేదు. నాకేదియూ కొరత లేదు. నాకేదేని పొందవలయునను అక్కరలేదు. అయిననూ నేను విహిత కర్మములను ఆచరించుచునే ఉందును.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top