భగవద్గీత - కర్మయోగము - మూడవ అధ్యాయము

భగవద్గీత - కర్మయోగము - మూడవ అధ్యాయము - పదహారవ శ్లోకము

ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతీహ యః |
అఘాయురింద్రియారామో మోఘం పార్థ స జీవతి ||

ఏవం = ఈ విధముగా
ప్రవర్తితం = వేదములచే నిర్ణయింపబడిన
చక్రం = వలయమును
న అనువర్తయతి = అనుసరింపనివాడు
ఇహ = ఈ జీవితమున
యః = ఎవడు
అఘాయుః = పాపమయజీవితము కలవాడు
ఇంద్రియారామః = ఇంద్రియభోగరహితుడై
మోఘం = వ్యర్థముగా
పార్థ = ఓ పృథాతనయా
సః = వాడు
జీవతి = జీవించును

తాత్పర్యం :-

ప్రియుడవైన ఓ అర్జునా! మానవ జీవితమున వేదములచే స్థాపింపబడిన యజ్ఞ చక్రమును అనుసరింపని వాడు నిజముగా పాపమయమైన జీవితముు గడుపును. అట్టివాడు ఇంద్రియ తృప్తి కొరకు మాత్రమే బ్రతుకుచు నిరర్ధక జీవి అగును.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top