భగవద్గీత - కర్మయోగము - మూడవ అధ్యాయము

భగవద్గీత - కర్మయోగము - మూడవ అధ్యాయము - మొదటి శ్లోకము

అర్జున ఉవాచ
జ్యాయసీ చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన |
తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ ||

అర్జునః ఉవాచ = అర్జునుడు పలికెను
జ్యాయసీ = ప్రశస్తతరము
చేత్ = అయినచో
కర్మణః = కామ్యకర్మము కన్నను
తే = నీవు
మతా = భావించినచో
బుద్ధిః = బుద్ధి
జనార్దన = ఓ కృష్ణా
తత్ = కావున
కిం = ఎందుకు
కర్మణి = కర్మమార్గమునందు
ఘోరే = భయంకరమైన
మాం = నన్ను
నియోజయసి = నియోగించుచున్నావు
కేశవ = ఓ కృష్ణా

తాత్పర్యం :-

అర్జునుడు పలికెను - ఓ జనార్దనా! కేశవా! కామ్య కర్మము కంటే బుద్ధియే ప్రాశస్తతరమని బావించినచో నన్ను ఈ భయంకరమైన యుద్ధమునందు నీవెందుకు వినియోగింపగోరుచున్నావు.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top