భగవద్గీత - కర్మయోగము - మూడవ అధ్యాయము

భగవద్గీత - కర్మయోగము - మూడవ అధ్యాయము - ముప్పై ఐదవ శ్లోకము

శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్టితాత్ |
స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః ||

శ్రేయాన్ = ఎక్కువ మేలైనది
స్వధర్మః = స్వధర్మము
విగుణః = గుణరహితమైనను
పరధర్మాత్ = ఇతరులకు విధింపబడిన ధర్మము కంటె
స్వనుష్టితాత్ = చక్కగా అనుసరింపబడినను
స్వధర్మే = తనకు విధింపబడిన ధర్మము నందు
నిధనం = నాశము
శ్రేయః = మేలైనది
పరధర్మః = ఇతరులకు విధింపబడిన ధర్మము
భయావహః = హానికరము

తాత్పర్యం :-

తమకు విదింపబడిన ధర్మములు ద్విగునములైననూ వానిని చేయుట పరధర్మమును లెస్సగా చేయుటకంటే చాలా మేలైనది. పరధర్మానుసరణము హానికరమగుటచే వానియందు మగ్నులతకంటే స్వధర్మము చేయుటలో నాశము పొందుటయైననూ మేలైనదే.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top