భగవద్గీత - కర్మయోగము - మూడవ అధ్యాయము

భగవద్గీత - కర్మయోగము - మూడవ అధ్యాయము - ఐదవ శ్లోకము

న హి కశ్చిత్ క్షణమపి జాతు తిష్ఠత్యకర్మకృత్ |
కార్యతే హ్యవశః కర్మ సర్వః ప్రకృతిజైర్గుణైః ||

హి = నిశ్చయముగా
కశ్చిత్ = ఎవడును
క్షణమపి = ఒక్క క్షణకాలమైనను
జాతు = ఎప్పుడును
న హి తిష్ఠతి = ఉండడు
అకర్మకృత్ = ఏదియో ఒకటి చేయకుండ
కార్యతే = చేయునట్లు ప్రేరేపింపబడుచుండును
హి = నిశ్చయముగా
అవశః = తన వశము లేనివాడై
కర్మ = పని
సర్వః = సర్వులు
ప్రకృతిజైః = భౌతికప్రకృతి వలన పుట్టిన
గుణైః = గుణములచే

తాత్పర్యం :-

ప్రతిజీవియు భౌతిక ప్రకృతి వలన పుట్టిన గుణములననుసరించి వివసుడై ఏదో ఒక పనిని చేయుటకు ప్రేరేపింపబడును. అందుచే ఎవ్వడునూ ఒక్క క్షణము కూడా ఏదో ఒక పనిని చేయకుండ ఉండజాలడు.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top