భగవద్గీత - కర్మయోగము - మూడవ అధ్యాయము

భగవద్గీత - కర్మయోగము - మూడవ అధ్యాయము - పద్దెనిమిదవ శ్లోకము

నైవ తస్య కృతేనార్థో నాకృతేనేహ కశ్చన |
న చాస్య సర్వభూతేషు కశ్చిదర్థవ్యపాశ్రయః ||

న = ఉండదు
ఏవ = నిశ్చయముగా
తస్య = అతనికి
కృతేన = కర్మాచరణముచే
అర్థః = ప్రయోజనము
న = కాని
అకృతేన = కర్మను ఆచరింపకపోవుటకు
ఇహ = ఈ ప్రపంచమునందు
కశ్చన = ఎట్టి ప్రయోజనమును
న చ = ఉండదు
అస్య = అతనికి
సర్వభూతేషు = సమస్త జీవులయందును
కశ్చిత్ = ఏదియోనొక
అర్థ వ్యపాశ్రయః = ప్రయోజనమును ఆశ్రయించియుండుట

తాత్పర్యం :-

తనకు విదింపబడిన కర్మములను చేయుటవలన ఆత్మానుభవము కల మానవునికి ఎట్టి ప్రయోజనమునూ ఉండదు. అట్టి కర్మలను నిర్వర్తింపకపోవుటకు ఎట్టి కారణము కాని, ఇతర జీవులపైన ఆధారపడి ఉండవలసిన అవసరము కాని అతనికి లేదు.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top