భగవద్గీత - కర్మయోగము - మూడవ అధ్యాయము

భగవద్గీత - కర్మయోగము - మూడవ అధ్యాయము - పదిహేనవ శ్లోకము

కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షరసముద్భవమ్ |
తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితమ్ ||

కర్మ = కర్మ
బ్రహ్మోద్భవం = వేదముల నుండి పుట్టినదిగా
విద్ధి = ఎరుంగుము
బ్రహ్మ = వేదము
అక్షర = పరబ్రహ్మము నుండి
సముద్భవమ్ = ప్రత్యక్షముగా వ్యక్తము చేయబడినది
తస్మాత్ = అందుచే
సర్వగతం = సర్వవ్యాపకమైన
బ్రహ్మ = పరబ్రహ్మము
నిత్యం = శాశ్వతముగా
యజ్ఞే = యజ్ఞమునందు
ప్రతిష్టితమ్ = స్థిరముగా నున్నది

తాత్పర్యం :-

క్రమబద్ధములైన కర్మములన్నియు వేదములచే విదింపబడినవి. వేదములు దేవాతి దేవుల నుండి ప్రత్యక్షముగా వ్యక్తముచేయబడినవి. అందుచే సర్వవ్యాపకము అయిన బ్రహ్మము యజ్ఞ కార్యములందు శాశ్వతముగా ప్రతిష్టింపబడినది.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top