భగవద్గీత - కర్మయోగము - మూడవ అధ్యాయము

భగవద్గీత - కర్మయోగము - మూడవ అధ్యాయము - నలుబదియవ శ్లోకము

ఇన్ద్రియాణి మనో బుద్ధిరస్యాధిష్టానముచ్యతే |
ఏతైర్విమొహయత్యేష జ్ఞానమావృత్య దేహినమ్ ||

ఇన్ద్రియాణి = ఇంద్రియములు
మనః = మనస్సు
బుద్ధిః = బుద్ధియు
అస్య = ఈ కామమునకు
అధిష్ఠానం = వాసస్థానము
ఉచ్యతే = చెప్పబడుచున్నవి
ఏతైః = వీనిచే
విమోహయతి = కలతపెట్టును
ఏషః = ఈ కామము
జ్ఞానం = జ్ఞానమును
ఆవృత్య = ఆవరించి
దేహినమ్ = జీవుల

తాత్పర్యం :-

ఇంద్రియములనూ, మనస్సునూ, బుద్ధియూ ఈ కామమునకు స్థావరములు. వీని ద్వారా కామము జీవుని యాదార్ధ జ్ఞానమును కప్పబుచ్చి అతనిని కలత పెట్టును.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top