భగవద్గీత - కర్మయోగము - మూడవ అధ్యాయము

భగవద్గీత - కర్మయోగము - మూడవ అధ్యాయము - పంతొమ్మిదవ శ్లోకము

తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర |
అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుషః ||

తస్మాత్ = అందుచే
అసక్తః = సంగత్వము లేకుండా
సతతం = ఎల్లప్పుడును
కార్యం = విధిగా
కర్మ = పనిని
సమాచర = ఒనరింపుము
అసక్తః = అసంగముగా
ఆచరన్ = చేయుచు
కర్మ = కర్మను
పరమ్ = పరమును
ఆప్నోతి = పొందును
పూరుషః = మానవుడు

తాత్పర్యం :-

అందుచే కర్మఫలములందు ఆసక్తి లేనివాడై తన ధర్మముగా భావించి మానవుడు కర్మను ఆచరింపవలయును. ఆసక్తి లేకుండా పనిచేయుటచే మానవుడు పరమ సత్యమును పొందును.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top