భగవద్గీత - కర్మయోగము - మూడవ అధ్యాయము

భగవద్గీత - కర్మయోగము - మూడవ అధ్యాయము - తొమ్మిదవ శ్లోకము

యజ్ఞార్థాత్ కర్మణోఽన్యత్ర లోకోఽయం కర్మబన్ధనః |
తదర్థం కర్మ కౌంతేయ ముక్తసంగః సమాచర ||

యజ్ఞార్థాత్ = యజ్ఞుని కొరకు లేక విష్ణువు కొరకు మాత్రమే చేయబడు
కర్మణః = కర్మకంటె
అన్యత్ర = వేరైనది
లోకోయం = ఈ లోకము
కర్మబన్ధనః = కర్మ ద్వారా బంధము
తదర్థం = ఆ విష్ణువు కొరకు
కర్మ = పనిని
కౌన్తేయ = ఓ కుంతీపుత్రా
ముక్తసంగః = అసంగుడవై
సమాచర = చక్కగా చేయుము

తాత్పర్యం :-

విష్ణువు కొరకు యజ్ఞ రూపమున కర్మనాచరింపవలయును. లేనిచో ఆ కర్మ ప్రపంచమున బంధకారంబగును. అందుచే ఓ కుంతీపుత్ర ఆ విష్ణువు తృప్తి కొరకు విదింపబడిన నీ ధర్మములను వనరింపుము. ఈ విధముగా నొనరించినచో నీవెప్పునూ బంధవిముక్తుడవై ఉందువు.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top