భగవద్గీత - కర్మయోగము - మూడవ అధ్యాయము

భగవద్గీత - కర్మయోగము - మూడవ అధ్యాయము - ఇరవై ఐదవ శ్లోకము

సక్తాః కర్మణ్యవిద్వాంసో యథా కుర్వన్తి భారత |
కుర్వాద్విద్వాంస్తథాసక్తః చికీర్షుర్లోకసంగ్రహమ్ ||

సక్తాః = ఆసక్తులై
కర్మణి = విహిత కర్మములందు
అవిద్వాంసః = పామరులు
యథా = ఎట్లు
కుర్వన్తి = వారుచేయుదురో
భారత = ఓ భరతవంశీయుడా
కుర్యాత్ = చేయవలయును
విద్వాన్ = పండితుడు
తథా = ఆ విధముగా
అసక్తః = సంగత్వము లేనివాడై
చికీర్షుః = మార్గదర్శనము చేయగోరి
లోకసంగ్రహమ్ = జనసామాన్యము

తాత్పర్యం :-

పామరులూ కర్మఫలమనందు ఆసక్తులై కర్మము చేయునట్లు సామాన్య జనులను ధర్మమార్గమున వర్తింపచేయుటకై ఆసక్తి లేకుండా విద్వాంసుడు విహిత కర్మములను ఆచరింపవలయును.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top