భగవద్గీత - కర్మయోగము - మూడవ అధ్యాయము

భగవద్గీత - కర్మయోగము - మూడవ అధ్యాయము - ఇరవై తొమ్మిదవ శ్లోకము

ప్రకృతేర్గుణసమ్మూఢా సజ్జన్తే గుణకర్మసు |
తానకృత్స్నవిదో మందాన్ కృత్స్నవిన్న విచాలయేత్ ||

ప్రకృతేః = భౌతికప్రకృతి యొక్క
గుణ = గుణములచే
సమ్మూఢాః = భౌతికమగ్నత వలన మూఢులైనవారు
సజ్జన్తే = ఆసక్తులగుదురు
గుణకర్మసు = భౌతికకర్మల యందు
తాన్ = అట్టి
అకృత్స్నవిదః = అల్పజ్ఞానము కలిగిన జనులు
మందాన్ = ఆత్మానుభూతిని గ్రహించుట యందు ఆలసులైనవారిని
కృత్స్నవిత్ = యథార్థజ్ఞానవంతుడు
న విచాలయేత్ = కలతపెట్టరాదు

తాత్పర్యం :-

భౌతిక ప్రకృతి గుణములచే కలతపెట్టబడిన అజ్ఞానులు భౌతిక కార్యములయందు పూర్తిగా మగ్నులై ఆసక్తులై ఉందురు. అట్టి కార్యములు కర్త యొక్క అజ్ఞానముచే అల్పములైనప్పటికినీ జ్ఞానవంతుడు వారిని కలతపెట్టరాదు.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top