భగవద్గీత - కర్మయోగము - మూడవ అధ్యాయము

భగవద్గీత - కర్మయోగము - మూడవ అధ్యాయము - నలబై మూడవ శ్లోకము

ఏవం బుద్దేః పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మానమాత్మనా |
జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదమ్ ||

ఏవమ్ = ఆ విధముగా
బుద్దేః = బుద్ధికన్నను
పరం = ఉత్తమమని
బుద్ధ్వా = తెలిసికొని
సంస్తభ్య = స్థిరపరచి
ఆత్మానమ్ = మనస్సును
ఆత్మనా = అత్యున్నతమైన బుద్ధిచే
జహి = జయింపుము
శత్రుమ్ = శత్రువును
మహాబాహో = గొప్ప బాహుబలము కలవాడా
కామరూపం = కామమనెడి
దురాసదమ్ = దుర్జయమైన

తాత్పర్యం :-

గొప్ప బాహుబలము గల ఓ అర్జునా! ఈ విధముగా లౌకికములైన ఇంద్రియముల కన్ననూ, మనస్సు కన్ననూ, బుద్ధి కన్ననూ ఆత్మ అతీతమని తెలిసికొని, మానవుడు అత్యున్నతమైన ఆధ్యాత్మిక బుద్ధిచే మనస్సును నిశ్చలమొనర్చుకొని, ఆ విధముగా ఆధ్యాత్మిక బలమును సంపాదించుకొని అనప శక్యము కాని కామమను శత్రువును జయింపవలెను.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top