భగవద్గీత - కర్మయోగము - మూడవ అధ్యాయము

భగవద్గీత - కర్మయోగము - మూడవ అధ్యాయము - పదకొండవ శ్లోకము

దేవాన్ భావయతానేన తే దేవా భావయన్తు వః |
పరస్పరం భావయన్తః శ్రేయః పరమవాప్స్యథ ||

దేవాన్ = దేవతలు
భావయత = సంతృప్తినొంది
అనేన = ఈ యజ్ఞముచే
తే దేవాః = ఆ దేవతలు
భావయన్తు = తృప్తిపరచుదురు
వః = మిమ్ము
పరస్పరం = ఒకరినొకరు
భావయన్తః = తృప్తిపరచుకొనుచు
శ్రేయః పరం = ఉత్కృష్టమైన శ్రేయస్సును
అవాప్స్యథ = మీరు పొందగలరు

తాత్పర్యం :-

యజ్ఞములచే తృప్తినొందిన దేవతలు మీకునూ తృప్తి కలిగింతురు. ఈ విధముగా మానవ దేవతల పరస్పర సహకారం వలన అందరికినీ సౌఖ్యసంపదలు కలుగును.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top