భగవద్గీత - కర్మయోగము - మూడవ అధ్యాయము

భగవద్గీత - కర్మయోగము - మూడవ అధ్యాయము - ఇరవై ఎనిమిదవ శ్లోకము

తత్త్వవిత్తు మహాబాహో గుణకర్మవిభాగయోః |
గుణా గుణేషు వర్తన్త ఇతి మత్వా న సజ్జతే ||

తత్త్వవిత్ = పరతత్త్వము నెరిగినవాడు
తు = కాని
మహాబాహో = గొప్పపరాక్రమము గల బాహువులు కలవాడా
గుణకర్మ = భౌతికప్రభావితమైన కర్మలు
విభాగయోః = భేదములు
గుణాః = ఇంద్రియములు
గుణేషు = ఇంద్రియతృప్తి యందు
వర్తంత = వర్తించును
ఇతి = అని
మత్వా = తలచి
న సజ్జతే = సక్తుడు కాడు

తాత్పర్యం :-

గొప్ప పరాక్రమము గల బాహువులు గల ఓ అర్జునా! పరమ సత్యమునెరింగిన వ్యక్తి భక్తియుక్తమైన కర్మకునూ, కామ్య కర్మలకునూ గల భేదమును పూర్తిగా నెరిగి తన ఇంద్రియములనూ ఇంద్రియ భోగములనూ నిమగ్నము చేయడు.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top