భగవద్గీత - కర్మయోగము - మూడవ అధ్యాయము

భగవద్గీత - కర్మయోగము - మూడవ అధ్యాయము - ముప్పై రెండవ శ్లోకము

యే త్వేతదభ్యసూయన్తో నానుతిష్ఠన్తి మే మతమ్ |
సర్వజ్ఞానవిమూఢాంస్తాన్ విద్ధి నష్టానచేతసః ||

యే = ఎవరు
తు = అయినప్పటికి
ఏతత్ = ఈ
అభ్యసూయన్తః = అసూయనొందుచు
న అనుతిష్ఠన్తి = క్రమముగా చేయరో
మే = నాయొక్క
మతమ్ = ఆదేశమును
సర్వజ్ఞానవిమూఢాన్ = అన్ని విధములుగా మూఢులైన
తాన్ = వారిగా
విద్ధి = తెలిసికొనుము
నష్టాన్ = భ్రష్టులుగను
అచేతసః = కృష్ణభక్తిరహితులుగను

తాత్పర్యం :-

కానీ అసూయచే ఎవరు ఈ ఉపదేశములను మన్నింపరో, అనుసరింపరో, అట్టివారిని జ్ఞాన విహీనులుగనూ, మూడులుగనూ, పరిపూర్ణత్వమును పొందు యత్నములలో బ్రష్టులుగనూ బావింపవలెను.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top