భగవద్గీత - కర్మయోగము - మూడవ అధ్యాయము

భగవద్గీత - కర్మయోగము - మూడవ అధ్యాయము - ముప్పై ఏడవ శ్లోకము

శ్రీభగవాన్ ఉవాచ
కామ ఏష క్రోధ ఏష రజోగుణసముద్భవః |
మహాశనో మహాపాప్మా విద్ధ్యేనమిహ వైరిణమ్ ||

శ్రీభగవానువాచ = దేవదేవుడైన శ్రీకృష్ణుడు పలికెను
కామః = కామము
ఏషః = ఈ
క్రోధః = కోపము
ఏషః = ఈ
రజోగుణసముద్భవః = రజోగుణము వలన పుట్టిన
మహాశనః = సర్వమును మ్రింగునట్టిది
మహాపాప్మా = గొప్పపాపము కలిగినట్టిది
విద్ధి = తెలిసికొనుము
ఏనం = ఈ
ఇహ = భౌతికప్రపంచమునందు
వైరిణమ్ = గొప్పశత్రువు

తాత్పర్యం :-

దేవాతిదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను - అర్జునా! రజోగుణ సంపర్కము వలన పుట్టిన కామమే కోపముగా పరినమించును. అది ఈ ప్రపంచమునకు సర్వమును మెరుంగునట్టియు, పాపముతో కూడినట్టియు అయిన గొప్ప శత్రువు.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top