భగవద్గీత - కర్మయోగము - మూడవ అధ్యాయము

భగవద్గీత - కర్మయోగము - మూడవ అధ్యాయము - నలబై రెండవ శ్లోకము

ఇంద్రియాణి పరాణ్యాహురింద్రియేభ్యః పరం మనః |
మనసస్తు పరా బుద్ధిర్యో బుద్దేః పరతస్తు సః ||

ఇన్ద్రియాణి = ఇంద్రియములు
పరాణి = ఉత్తమములు అని
ఆహుః = చెప్పబడినది
ఇంద్రియేభ్యః = ఇంద్రియముల కన్నను
పరమ్ = ఉత్తమము
మనః = మనస్సు
మనసః = మనస్సు కన్నను
తు = కూడా
పరా = ఉత్తమము
బుద్దేః = బుద్ధిః
యః = ఎవరు
బుద్దేః = బుద్ధికన్నను కూడా
పరతః = ఉత్తముడు
తు = కాని
సః = అతడు

తాత్పర్యం :-

జడపదార్ధము కంటే పనిచేయు ఇంద్రియములు ఉత్తమము. ఇంద్రియముల కంటే మనస్సు ఉత్తమతరము. మనస్సు కంటే కూడా బుద్ధి ఉత్తమతమము. బుద్ధి కంటే కూడా ఆత్మ మహోత్తమము.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top