భగవద్గీత - కర్మయోగము - మూడవ అధ్యాయము

భగవద్గీత - కర్మయోగము - మూడవ అధ్యాయము - పదనాలుగవ శ్లోకము

అన్నాద్భవన్తి భూతాని పర్జన్యాదన్నసమ్భవః |
యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మసముద్భవః ||

అన్నాత్ = ధ్యానము వలన
భవన్తి = పెరుగును
భూతాని = భౌతికశరీరములు
పర్జన్యాత్ = వర్షము నుండి
అన్నసమ్భవః = ధాన్యముల ఉత్పత్తి
యజ్ఞాత్ = యజ్ఞములను చేయుట వలన
భవతి = కలుగును
పర్జన్యః = వర్షము
యజ్ఞః = యజ్ఞాచరణము
కర్మ = విహితకర్మలు
సముద్భవః = ఉద్భవించినది

తాత్పర్యం :-

జీవులన్నియూ వర్షముల నుండి ఉత్పన్నమగు ఆహారధాన్యములపై ఆధారపడి జీవించును. వర్షములు యజ్ఞాచరణము వలన కలుగును. యజ్ఞము విహిత కర్మాచరణముల వల్ల కలుగును.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top