భగవద్గీత - కర్మయోగము - మూడవ అధ్యాయము

భగవద్గీత - కర్మయోగము - మూడవ అధ్యాయము - మూడవ శ్లోకము

శ్రీభగవాన్ ఉవాచ
లోకేఽస్మిన్ ద్వివిధా నిష్ఠా పురా ప్రోక్తా మయానఘ |
జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినామ్ ||

శ్రీభగవానువాచ = దేవదేవుడైన శ్రీకృష్ణుడు పలికెను
లోకే = లోకమునందు
అస్మిన్ = ఈ
ద్వివిధా = రెండు విధములైన
నిష్ఠా = శ్రద్ధ
పురా = పూర్వము
ప్రోక్తా = చెప్పబడినది
మయా = నాచేత
అనఘ = పాపరహితుడా
జ్ఞానయోగేన = జ్ఞానయోగము చేత
సాంఖ్యానాం = తత్త్వవేత్తల
కర్మయోగేన = భక్తియోగవిధానము చేత
యోగినాం = భక్తులకు

తాత్పర్యం :-

దేవాతిదేవుడైన కృష్ణుడు పలికెను - పాపరహితుడవైన ఓ అర్జునా ఆత్మానుభూతిని పొందయత్నించు రెండు తరగతుల మానవులను గూర్చి నేను ఇది వరకే చెప్పియుంటిని. కొందరు తాత్వికమైన తాత్విక కల్పనలచేతనూ, మరి కొందరు భక్తి యుక్తమైన సేవల చేతనూ దానిని అర్ధము చేసికొనగోరుదురు.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top