భగవద్గీత - కర్మయోగము - మూడవ అధ్యాయము

భగవద్గీత - కర్మయోగము - మూడవ అధ్యాయము - ఇరవై ఆరవ శ్లోకము

న బుద్ధిభేదం జనయేదజ్ఞానాం కర్మసఙ్గినామ్ |
జోషయేత్సర్వకర్మాణి విద్వాన్ యుక్తః సమాచరన్ ||

బుద్ధిభేదం = మానసికకలతను
న జనయేత్ = కలిగింపరాదు
అజ్ఞానామ్ = పామరులకు
కర్మసఙ్గినామ్ = కామ్యకర్మల యందాసక్తి కలవారైన
జోషయేత్ = సంధింపవలయును
సర్వకర్మాణి = అన్నికర్మలను
విద్వాన్ = పండితుడు
యుక్తః = మగ్నుడై
సమాచరన్ = చేయుచు

తాత్పర్యం :-

విహిత కర్మఫలములందు ఆసక్తి కల పామరుల మనస్సులను కలతపరపకుండుటకై విద్వాంసుడు వారిని కర్మ మానమని ప్రేరేపింపకూడదు. అట్లు కాక అతడు భక్తి తత్వముతో తాను పనిచేయుచు అన్ని విధములైన కర్మములందునూ వారిని మగ్నులనొనరింప వలయును.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top