భగవద్గీత - కర్మయోగము - మూడవ అధ్యాయము

భగవద్గీత - కర్మయోగము - మూడవ అధ్యాయము - నలబై ఒకటవ శ్లోకము

తస్మాత్త్వమిన్ద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ |
పాప్మానం ప్రజహి హ్యేనం జ్ఞానవిజ్ఞాననాశనమ్ ||

తస్మాత్ = అందుచే
త్వమ్ = నీవు
ఇంద్రియాని = ఇంద్రియములను
ఆదౌ = మొదటనే
నియమ్య = నియమించి
భరతర్షభ = భరతవంశీయులలో
హి = నిశ్చయముగా
ఏనమ్ = ఈ
జ్ఞాన = జ్ఞానమును
విజ్ఞాన = ఆత్మ యొక్క శాస్త్రీయజ్ఞానమును
నాశనమ్ = నశింపజేయునది

తాత్పర్యం :-

అందుచే భరతవంశస్తులలో శ్రేష్టుడవైన ఓ అర్జునా! ఇంద్రియ నిగ్రహముచే గొప్ప పాప చిహ్నమైన ఈ కామమును మొట్టమొదటనే అదుపుచేసి జ్ఞానమును, అత్మానుభవమును నాశనము చేయునట్టి దానిని సంహరింపుము.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top