భగవద్గీత - కర్మయోగము - మూడవ అధ్యాయము

భగవద్గీత - కర్మయోగము - మూడవ అధ్యాయము - ముప్పై ఆరవ శ్లోకము

అర్జున ఉవాచ
అథ కేన ప్రయుక్తోఽయం పాపం చరతి పూరుషః |
అనిచ్చన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజితః ||

అర్జునః ఉవాచ = అర్జునుడు పలికెను
అథ = అప్పుడు
కేన = దేనిచే
ప్రయుక్తః = ప్రేరితుడై
అయం = ఈ
పాపం = పాపమును
చరతి = చేయును
పూరుషః = మానవుడు
అనిచ్ఛనపి = కోరకపోయినను
వార్ష్ణేయ = ఓ వృష్టివంశసంజాతుడా
బలాత్ = బలవంతముగా
ఇవ = వలె
నియోజితః = నియోగింపబడినవాని

తాత్పర్యం :-

అర్జునుడు పలికెను - వృష్ణివంత సంబూతుడవైన ఓ కృష్ణా! అనిష్టముగానైననూ మానవుడు బలవంతముగా నియోగింపబడినవాడై దేనిచే పాపకార్యములు చేయుటకు ప్రేరేపింపబడుచున్నాడు.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top