భగవద్గీత - కర్మయోగము - మూడవ అధ్యాయము

భగవద్గీత - కర్మయోగము - మూడవ అధ్యాయము - ఇరవై ఏడవ శ్లోకము

ప్రకృతేః క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః |
అహంకారవిమూఢాత్మా కర్తాహమితి మన్యతే ||

ప్రకృతేః = భౌతికప్రకృతి యొక్క
క్రియమాణాని = చేయబడుచున్నట్టి
గుణైః = గుణములచే
కర్మాణి= కర్మలకు
సర్వశః = అన్నిరకములైన
అహంకార విమూఢ = మిథ్యాహంకారముచే విమోహితుడై
ఆత్మా = జీవుడు
కర్తా = కర్తను
అహం = నేను
ఇతి = అని
మన్యతే = తలంచును

తాత్పర్యం :-

అహంకారము యొక్క ప్రభావముచే కలతనొందింపబడినదై జీవాత్మ నిజముగా భౌతిక ప్రకృతి యొక్క గుణములచే చేయబడిన కర్మలకు తానే కర్తనని బావించును.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top