భగవద్గీత - కర్మయోగము - మూడవ అధ్యాయము

భగవద్గీత - కర్మయోగము - మూడవ అధ్యాయము - ఏడవ శ్లోకము

యస్త్వింద్రియాణి మనసా నియమ్యారభతేఽర్జున |
కర్మేంద్రియైః కర్మయోగమసక్తః స విశిష్యతే ||

యః = ఎవడు
తు = కాని
ఇంద్రియాణి = ఇంద్రియములను
మనసా = మనస్సుచే
నియమ్య = నిగ్రహించి
ఆరభ తే = ఆరంభించునో
అర్జున = అర్జునా
కర్మేన్ద్రియైః = కర్మేంద్రియముల చేత
కర్మయోగం = భక్తిని
అసక్తః = సంగత్వము లేనివాడై
సః = అతడు
విశిష్యతే = అత్యుత్తముడు

తాత్పర్యం :-

ఓ అర్జునా! అట్లు కాక ఏ మానవుడు హృదయ పూర్వకముగా మనస్సుచే ఇంద్రియములను నిగ్రహించి ఆసక్తి లేకుండా తృష్ణచైతన్యమున కర్మేంద్రియములచేత కర్మయోగమునారంబించునో అతడు చాల ఉత్తముడు.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top