భగవద్గీత - కర్మయోగము - మూడవ అధ్యాయము

భగవద్గీత - కర్మయోగము - మూడవ అధ్యాయము - ఇరవై మూడవ శ్లోకము

యది హ్యహం న వర్తేయం జాతు కర్మణ్యతంద్రితః |
మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః ||

యది = ఒకవేళ
హి = నిశ్చయముగా
అహం = నేను
న వర్తేయం = కర్మల యందు వర్తింపనిచో
జాతు = ఎప్పుడైనను
కర్మణి = విహితకర్మాచరణము నందు
అతన్ద్రితః = అత్యధిక శ్రద్ధ కలవాడనై
మమ = నాయొక్క
వర్త్మ = మార్గమును
అనువర్తన్తే = అనుసరింతురు
మనుష్యాః = మానవులందరును
పార్థ = ఓ పృథాకుమారా
సర్వశః = అన్నివిధముల

తాత్పర్యం :-

ఓ పార్థా! విహిత కర్మములను నేను శ్రద్ధతో చేయకుండినచో మానవులందరునూ నా మార్గమునే అనుసరింతురు.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top