భగవద్గీత - కర్మయోగము - మూడవ అధ్యాయము

భగవద్గీత - కర్మయోగము - మూడవ అధ్యాయము - ముప్పై ఎనిమిదవ శ్లోకము

ధూమేనావ్రియతే వహ్నిర్యథాదర్శో మలేన చ |
యథోల్బేనావృతో గర్భస్తథా తేనేదమావృతమ్ ||

ధూమేన = పొగచే
ఆవ్రియతే = కప్పబడును
వహ్ని = అగ్ని
యథా = వలె
ఆదర్శః = అద్దము
మలేన = దుమ్ముచే
చ = కూడా
యథా = వలె
ఉల్భేన = మావిచే
ఆవృతః = ఆవరింపబడును
గర్భః = గర్భస్థ పిండము
తథా = అట్లు
తేన = ఆ కామముచే
ఇదమ్ = ఇది
ఆవృతమ్ = ఆవరింపబడియున్నది

తాత్పర్యం :-

అగ్ని పొగచేతనూ, అద్ధము దుమ్ముచేతనూ, గర్భము మావిచేతనూ ఆవరింపబడి యుండునట్లు జీవుడు కూడా కామము యొక్క వివిధ దశలచే ఆవరింపబడియుండును.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top